తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని సీరియల్ నటి రసజ్ఞ రీతు. పలు ధారావాహిక ల్లో నటిస్తూ తెలుగు వారి హృదయాలు దోచుకున్నారు. రసజ్ఞ రీతు 10-11-1998 న కర్ణాటకలో మంజుల వీరంత్ రెడ్డి దంపతులకు జన్మించారు. రసజ్ఞ గారు ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు.
రసజ్ఞ గారు మోడల్ మరియు నటి. చదువు నటన తో పాటు క్రీడల్లో కూడా తన ప్రతిభ కనబరిచారు. రసజ్ఞ గారు టగ్ ఆఫ్ వార్, త్రో బాల్ జాతీయ స్థాయి క్రీడాకారిణి.
త్రో బాల్ , టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో ఎన్నో ట్రోఫీ లను సాధించారు. పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు పర్యాయాలు పథకాలు సాధించారు.
మోడలింగ్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిన రసజ్ఞ, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా తన నటన జీవితాన్ని మొదలు పెట్టారు. పలు వెబ్ సీరీస్ మరియు యూట్యూబ్ వీడియోస్ లో నటించారు. సినిమాలలో తొలి సారి సందీప్ కిషన్ హీరోగా చేసిన నిను వీడని నీడను నేనే లో నటించారు.
జీ తెలుగు ధారావాహిక మీనాక్షి ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఈ టీవీ లో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి ధారావాహిక లో నటిస్తున్నారు. డ్యాన్స్ , సంగీతం పట్ల ఆసక్తి మరియు ఖాళీ సమయాల్లో కొత్త రకాల వంటలు చేస్తుంటారు.
రసజ్ఞ గారు నటించిన కొన్ని యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, వెబ్ సీరీస్ :
- కిర్రాక్ పోరి
- యువ ఎంటర్టైన్మెంట్
- తెలుగు వన్
- సరదా బుల్లోడు ఛానెల్స్ లో పలు షార్ట్ ఫిల్మ్ చేశారు.
- సూర్య కాంతం వెబ్ సీరీస్ లో నటించారు.
రసజ్ఞ రీతు నటించిన సీరియల్స్ :
- మీనాక్షి ( జీ తెలుగు )
- ఆడదే ఆధారం ఈ(టీవీ)
- మజిలీ ( ఈటీవీ)
- ప్రస్తుతం నా పేరు మీనాక్షి (ఈ టీవీ) ధారావాహిక లో నటిస్తున్నారు.
రసజ్ఞ గారు నటించిన సినిమా : నిను వీడని నీడను నేనే
రసజ్ఞ రీతు గురించి మరిన్ని విషయాలు, విశేషాలు:
పేరు : రసజ్ఞ రీతు
పుట్టిన తేది : 10-11-1998
తల్లిదడ్రులు : మంజుల వీరంత్ రెడ్డి
స్వస్థలం : కర్ణాటక
మాతృ భాష : కన్నడ
హాబీస్ : డ్యాన్స్, సంగీతం, వంటలు చేయడం.
Instagram ID : rasagnya reddy

















Comments
Post a Comment