Skip to main content

మహేశ్వరి వద్ది

 మహేశ్వరి వద్ది



ఒక సామాన్య కుటుంబంలో జన్మించి చదువులో, నటనలో, నృత్యంలో, ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరిచిన తెలుగు అమ్మాయి మహేశ్వరి వద్ది..

మహేశ్వరి వద్ధీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లోని పత్తికొండ గ్రామం లో జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది , తల్లి బ్యూటీషన్. చిన్నతనం నుండి మహేశ్వరి శాస్ర్తీయ నృత్యము , కూచిపూడి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు.  శేషు బాబు గారి శిష్యుడైన మంత్రి కాంత రావు ( ఎం . ఏ {డ్యాన్స్} ) గారి దగ్గర శిక్షణ తీసుకున్నారు. 8 సంవత్సరాల వయసులో  మొదటి సారి నాట్య ప్రదర్శన చేశారు. కూచిపూడి నాట్యం లో డిప్లొమా చేశారు.

నాట్యంతో పాటు చదువులో కూడా అపార ప్రతిభ కనబరిచారు. పదవ తరగతిలో స్కూల్ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. స్కూల్ స్థాయి నుండే ఆట పాటలలో, ఇతర కాంపిటీషన్స్ లో చురుకుగా పాల్గొనే వారు. ఇంటర్ పరీక్షల్లో 95% మార్కులతో స్టేట్ లో టాప్ ర్యాంక్ సాధించారు. ఇంటర్ తర్వాత  బీ. కామ్ లో తన కాలేజీ లో 100% మార్క్స్ సాధించి అకాడెమీ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకున్నారు. CA -CPT పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మరియు ఎం బీ ఏ మూడవ సెమిస్టర్ లో కాలేజ్ టాపర్ గా నిలిచారు.   తన పోస్ట్ గ్రాడ్యుయేట్  ఎం. బీ . ఏ చదువుతున్న సమయంలో మిస్ ఫ్రెషర్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచారు.
బీ. కామ్ లో సాధించిన అకాడెమీ ఎక్సలెన్స్ అవార్డ్ 

పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న సమయంలో మిస్ ప్రెషర్ కంటేస్ట్లో పాల్గొన్న సమయంలో

తల్లితండ్రుల ప్రోత్సాహం, గురువుగారి ప్రోద్బలం వల్ల
చదువు కొనసాగిస్తూ నాట్యం మరియు మోడలింగ్ లో రాణించారు. 2016 వ సంవత్సరం లో ఎంటర్టైన్మెంట్ రంగంలో  ఒక లోకల్ ఛానెల్ ద్వారా అడుగు పెట్టారు. ఇది నా స్వరం ప్రోగ్రాం లో యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. 
మహేశ్వరి మొదటి సారి యాంకర్ గా చేసిన ప్రోగ్రాం, ఇది నా స్వరం

కూచిపూడి నాట్యం పై ఉన్న మక్కువ తో, దేశ వ్యాప్తంగా సుమారు వెయ్యి కి పైగా నాట్య ప్రదర్శనలు చేశారు. మూడు రోజుల అంతర్జాతీయ కూచిపూడి నాట్య ప్రదర్శనలో పాల్గొని ప్రత్యేక ప్రదర్శన చేశారు. ఇందులోనే దాదాపు 6000 మందికి పైగా డాన్సర్ లతో కలిసి ఒకే పాట పై ఓకే సమయంలో చేసిన నృత్య ప్రదర్శన వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్


2018 లో మహేశ్వరి గారు  మాంగళ్య షాపింగ్ మాల్ వారి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుయ్యారు.






తనకి వచ్చిన కళను నలుగురికి నేర్పించాలని సదుద్దేశంతో మహేశ్వరి గారు సొంతంగా శాస్త్రీయ  నాట్య అకాడెమీ " నాట్యేశ్వరి కళాక్షేత్ర " ను స్థాపించారు. ఇందులో అన్ని వయసుల వారికి పది కంటే ఎక్కువ కళల పై శిక్షణ ఇస్తున్నారు. కరాటే, కూచిపూడి, కథక్, జానపద కళలు, జుంబ, బాలీవుడ్ స్టైల్, క్రాఫ్ట్, సంగీతం , పాటలు అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ మొదలైన వాటిలో శిక్షణ ఇస్తున్నారు. పిల్లల కోసం 42 రోజుల సమ్మర్ క్యాంప్ నిర్వహించి వారిలోని కళ నైపుణ్యాన్ని వెలికతీసేందుకు కృషి చేస్తున్నారు. 2018-19 మొదటి బ్యాచ్ లో 85 విద్యార్థులు ఇందులో శిక్షణ పొందారు.


సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందిన విద్యార్థులతో


సమ్మర్ క్యాంప్ విద్యార్థుల ప్రదర్శనలు, ఆట పాటలు.

కళా రంగంలో చేసిన సేవను గుర్తిస్తూ ఢిల్లీలో జరిగిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకల్లో, సలాం టు కలాం నేషనల్ ఎక్సలెన్సు అవార్డ్ ను అప్పటి సుప్రీం కోర్టు జడ్జ్ శ్రీ నారాయణ గారి చేతుల మీదుగా అందుకున్నారు.
సలాం టు కలాం నేషనల్ ఎక్సలెన్సు అవార్డ్ అందుకుంటున్న మహేశ్వరి

కొత్త ప్రదేశాలకు వెళ్ళటం, ప్రయాణాలు చేయడం పై ఉన్న ఆశక్తి తో భారత దేశం మొత్తం పర్యటించారు. ఇష్టమైన స్థలాలు కేరళ, రాజస్థాన్, వైజాగ్. ప్రపంచ పర్యటన చేయాలనేది ఆమె కోరిక.


మహేశ్వరి ట్రావెల్ ఆల్బమ్ నుండి కొన్ని ఛాయ చిత్రాలు

ప్రస్తుతం తెలుగు లో ప్రముఖ నటుడి సరసన హీరోయిన్ గా చేస్తున్నారు, ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు సినిమా పాట రీమేక్ చేయనున్నారు. తమిళ మరియు తెలుగు  ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటి మోనాల్ గజ్జర్ గారితో నటిస్తున్నారు. తెలుగులో ఒక సందేశాత్మక చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు .
 
సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశంతో పచ్చదనం కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని, తన తోటి వారిని చెట్ల పెంపకంలో ప్రోత్సహించారు.




కరోనా వల్ల చాలా మంది నష్టపోయారు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు. వాళ్ళ బాధను గమనించి , చిన్న మధ్య తరహా వ్యాపారస్తుల వస్తువులను, వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తనకు తోచిన సహాయం చేస్తున్నారు. మహిళల సాధికారత, వోకల్ ఫర్ లోకల్ భారత్ వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ మహిళలకి, చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి చేయూత అందిస్తున్నారు.  యువతకి , మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

NARMUL అంబాసిడర్ గా మహేశ్వరి

ప్రస్తుతం మహేశ్వరి గారు, నల్గొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక యూనియన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.

మహేశ్వరి గారు చేసిన కొన్ని టీవీ ప్రోగ్రామ్స్:
  • ఇది నా స్వరం , లోకల్ టీవీ చానెల్ (ఓ టీవీ)
  • జీ తెలుగు లో పలు సీరియల్స్ లో నటించారు. దట్ ఈజ్ మహాలక్ష్మి ధార వాహిక లో ప్రముఖ పాత్రలో నటించారు. మీనాక్షి ధార వహికలో మైన్ లీడ్ గా నటించారు. 
  • జీ తెలుగు ఛానెల్లో ఢీ జోడీ లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేశారు. మరియు వివిధ వినోద కార్యక్రమాలలో స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
  • ప్రస్తుతం  ఈ టీవీ చానెల్ లో  అత్తారింటికి దారేది సీరియల్ లో హీరోయిన్ గాను , యమలీల లో నెగటివ్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు .
మహేశ్వరి గారి గురించి మరిన్ని వివరాలు
  • పూర్తి పేరు : మహేశ్వరి వద్దీ
  • తండ్రి పేరు : వద్ధీ పములేటి
  • తల్లి పేరు: వద్ధీ సుజాత
  • తోబుట్టువులు : జ్ఞానేశ్వరి , ప్రశాంతి
  • పుట్టిన తేది : 02-03-1999
  • స్వస్థలం : పత్తికొండ, కర్నూల్ జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
  • ఎత్తు : 5'6"
  • బరువు : 55
  • చదువు : ఎం. బీ. ఏ ( ఫైనాన్స్) , డిప్లొమా ఇన్ కూచిపూడి డాన్స్.
  • వృత్తి : శాస్ర్తీయ నృత్య కారిని, మోడల్, నటి, యాంకర్, 
  • ఇష్టాలు : కొత్త ప్రదేశాల పర్యటన, నాట్యం.

తల్లితండ్రుల ప్రోత్సాహం, గురువు గారి తోడ్పాటు వలన ఇన్ని విజయాలు సాధించిన మహేశ్వరి గారు మరిన్ని విజయాలు, కీర్తి సాధించాలని కోరుతున్నాం.



































Comments

Popular posts from this blog

Lora Maddison

  లోర మాడిసన్, అప్సర లాంటి అందగత్తె, రంభ ఊర్వశి లను తలదన్నే అందం. తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ నిజామాబాద్ జిల్లా గంగస్తాన్ లో రాజమని ప్రకాష్ దంపతులకు జన్మించారు. తండ్రి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి, తల్లి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో జుడిషియల్ ఎంప్లాయ్. లోరా  నిజామాబాద్ లోని రాఘవ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇంటర్ కాకతీయ కాలేజ్ లో చేశారు. మల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, నటన  పై ఆశక్తి తో సహోదరులు ప్రవీణ్, ప్రశాంత్ గార్ల సహకరాలతో షార్ట్ ఫిల్మ్ రంగం లో అడుగుపెట్టారు.  మోడలింగ్, రంప్ వాక్, బ్యూటీ కంటేస్ట్లో పాల్గొన్నారు . మరియు పలు మోడలింగ్ షో లకు గెస్ట్ గా వచ్చారు. వేదిక్ హైర్ అడ్స్ చేశారు. నటనలో లోరా ప్రావీణ్యం ప్రదర్శన కి గాను పలు అవార్డ్స్ అందుకున్నారు.  నటనతో పాటు విద్యార్థులకు గణితం మరియు ఆంగ్లం బోధించారు. అలాగే నిజామాబాద్ లో ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ కల్పించారు, అలాగే లోరా డిజైనర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, దాదాపు 3000 మందికి ఫ్యాషన్ డిజైనింగ్ లో

Lora Madisson Latest photo shoot

 

Bazar rowdy fame Lora Madisson at American Association Telugu Atlanta(ATA) as a guest

 

Actress Lora Madison Latest Hot Photo shoot