రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకుల అభిమానం , ప్రేమ సంపాదించిన తెలుగు నటి, మోడల్, షబీన షేక్.
షబీన గారి స్వస్థలం వరంగల్ , తెలంగాణ. కానీ స్థిరపడింది ఆంధ్ర లోని వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం. రెండు రాష్ట్రాల ముద్దు బిడ్డ మన శాబీన షేక్ అక్టోబర్ 8 1998 లో సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించారు.
చిన్నతనం నుండే చాలా చురుకుగా ఉండేవారు. స్థానిక జెడ్. పి . హెచ్, ఎస్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదివారు.
ఇంటర్ ఎస్ .డీ .ఎస్ కళాశాల మరియు డిగ్రీ సీ .ఎస్ .టీ . ఎస్ కళాశాల ( జంగారెడ్డి గూడెం ) కళాశాలలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఎం. ఏ (ఇంగ్లీష్) , ఆంధ్ర యూనివర్సిటీ నుండి చేస్తున్నారు. చదువుకొనే రోజుల్లోనే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. తన కళాశాలలో నిర్వహించే మిస్ ఫ్రెషర్ కాంపిటీషన్ లో, మరియు రాజమండ్రి లో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని చూపరులను ఆకట్టుకున్నారు.
మోడలింగ్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత న్యూస్ రీడర్ గా , జర్నలిస్ట్ గా పలు ఛానెల్స్ లో చేశారు. ప్రదీప్ పెళ్ళిచూపులు ప్రోగ్రాంలో కూడా తళుక్కమన్నారు.
మొదటి సారి ఏ బీ ఎన్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా చేశారు. ఐ న్యూస్ , మోజో టీవీ, ఎన్ టీవీ చానెల్ లో పని చేశారు.
ప్రస్తుతం తెలుగు సీరియల్ లో నటిస్తున్న షబీనా గారి మొదటి సీరియల్ అత్తారింటికి దారేది..... కస్తూరి ధారావాహిక లో కూడా నటించారు. ప్రస్తుతం నా పేరు మీనాక్షి ధారావాహిక లో నటిస్తున్నారు.
సై టీవీ యూట్యూబ్ ఛానెల్ జానపద పాట "" తిన్నా తీరం పడతలే, కూసున్న తీరం పడతలే "" తన నృత్యం , అభినయం తో ఆకట్టుకున్నారు.
షబీన గారి గురించి మరిన్ని విషయాలు :
పేరు : షబీన షేక్
కుటుంబం : అమ్మ , నాన్న, అక్క, అన్నయ్య
స్వస్థలం : వరంగల్, ( ప్రస్తుతం వెస్ట్ గోదావరి)
విద్య : ఎం. ఎ ( ఇంగ్లీష్)
వృత్తి ; నటి, న్యూస్ రీడర్, జర్నలిస్ట్, మోడల్
ఎత్తు : 5'2"
బరువు : 48కేజీ
హాబీస్ : మ్యూజిక్ వినడం, టీవీ, ఇన్స్త రీల్స్.
Comments
Post a Comment