మహేశ్వరి వద్ది ఒక సామాన్య కుటుంబంలో జన్మించి చదువులో, నటనలో, నృత్యంలో, ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరిచిన తెలుగు అమ్మాయి మహేశ్వరి వద్ది.. మహేశ్వరి వద్ధీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లోని పత్తికొండ గ్రామం లో జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది , తల్లి బ్యూటీషన్. చిన్నతనం నుండి మహేశ్వరి శాస్ర్తీయ నృత్యము , కూచిపూడి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు. శేషు బాబు గారి శిష్యుడైన మంత్రి కాంత రావు ( ఎం . ఏ {డ్యాన్స్} ) గారి దగ్గర శిక్షణ తీసుకున్నారు. 8 సంవత్సరాల వయసులో మొదటి సారి నాట్య ప్రదర్శన చేశారు. కూచిపూడి నాట్యం లో డిప్లొమా చేశారు. నాట్యంతో పాటు చదువులో కూడా అపార ప్రతిభ కనబరిచారు. పదవ తరగతిలో స్కూల్ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. స్కూల్ స్థాయి నుండే ఆట పాటలలో, ఇతర కాంపిటీషన్స్ లో చురుకుగా పాల్గొనే వారు. ఇంటర్ పరీక్షల్లో 95% మార్కులతో స్టేట్ లో టాప్ ర్యాంక్ సాధించారు. ఇంటర్ తర్వాత బీ. కామ్ లో తన కాలేజీ లో 100% మార్క్స్ సాధించి అకాడెమీ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకున్నారు. CA -CPT పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మరియు ఎం బీ ఏ మూడవ సెమిస్టర్ లో కాలేజ్ టాపర్ గా నిలిచారు. తన పోస్ట్ గ్రాడ్యుయే